మెట్‌పల్లిలో అనారోగ్యంతో బొల్లారం రాజ గంగారాం మృతి
ప్రజా దండోర న్యూస్ / మెట్‌పల్లి ప్రతినిధి, ఆగస్టు 23:
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన బొల్లారం రాజ గంగారాం ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
రాజ గంగారాం మృతి చెందడంతో వారి కుమారులు బొల్లారం అనీల్ కుమార్, అరుణ్ కుమార్ లు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుడు రాజు గంగారాం అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు, కుల సంఘం సభ్యుల సమక్షంలో ఊరేగింపుగా అంతిమయాత్రతో వెళ్లి ఘనంగా నిర్వహించారు.

0 Comments