వ్యసన విముక్తి భారత్ ను నిర్మిద్దాం- కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్


 వ్యసన విముక్తి భారత్ ను నిర్మిద్దాం- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 13:


నషా ముక్త్ భారత్ అభియాన్ మరియు మిషన్ స్పందన ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ కోరుట్ల కేంద్రం వారు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బుధవారం వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి చైతన్యవంతమైన పౌరులుగా మారి బలమైన సమాజాన్ని ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు . బ్రహ్మకుమారిస్ కోరుట్ల కేంద్ర నిర్వాహకులు రాజేశ్వరి వారి బృందం  విద్యార్థులచే వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. 



ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ,డైరెక్టర్ హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments