కోరుట్లలో ఘనంగా అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ
సుమారు 800 మందికి అన్నప్రసాదం • సంప్రదాయబద్ధంగా గోపూజ • ప్లాస్టిక్ రహితంగా సేవా కార్యక్రమం
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 13:
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో బుధవారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ భక్తిశ్రద్ధలతో విజయవంతంగా జరిగింది.
శ్రీ ఫణీంద్ర శర్మ గారి వైదిక నిర్వహణలో ముందుగా సామూహిక గోపూజ, అన్నపూర్ణ మాత పూజ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా సుమారు 800 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కోరుట్ల పట్టణంలో ప్రతి అమావాస్య నాడు పితృదేవతల ప్రీత్యర్థం, లోకకల్యాణం కోసం అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ వాట్సాప్ గ్రూప్ సభ్యుల సహకారంతో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో గత 13 నెలలుగా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మరో విశేషంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అన్నప్రసాద వితరణకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మాత్రమే ఉపయోగించి పర్యావరణ హితమైన సందేశాన్ని సమాజానికి అందించారు.
కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరిక్రిష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వనపర్తి చంద్ర మోహన్, కన్వీనర్ గంప శివ కుమార్, ట్రెజరర్ మంచాల రమేష్, సభ్యులు మంచాల రాజలింగం,శ్రీపతి రమేష్, కట్కం రంజిత్ కుమార్, పల్లెర్ల మహేందర్, కంఠం సదాశివ,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, వెంకటేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ఆర్ శ్రీనివాస్ రావు,కట్కం జగదీశ్వర్, కొత్త గణేష్, మాడిశెట్టి రవీందర్, అడువాల ప్రభాకర్, మల్లన్న ,చౌదరి సూర్యకాంత్, ఎలిమి బుచ్చన్న, కమటాల భాస్కర్, అల్లాడి మహేష్, కొత్త హన్మయ్య, గుడిసె కోటేష్, ఏనుగందుల రాజేంద్ర ప్రసాద్ మరియు మహిళా సేవకులు గంప రమాదేవి, వనపర్తి రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన దాతలు, వాట్సాప్ గ్రూప్ సభ్యులు, సేవాకార్యకర్తలు, భక్తులు, పట్టణ ప్రజలందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


0 Comments