కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 11:
కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో భాగంగా ఎస్పీ ఈ తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. ప్రతి కేసులో దర్యాప్తును నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.అలాగే పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని, స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థ అమలు, రాత్రి గస్తీ, నేరాల నియంత్రణ చర్యలు తదితర అంశాలపై ఎస్పీ గారు సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు మరియు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, గంజాయి, డ్రగ్స్, నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, ప్రమాదకర డ్రైవింగ్, మైనర్ల వాహనాల వినియోగం, మోడిఫైడ్ సైలెన్సర్ల పై చట్టపరమైన చర్యలు కొనసాగించాలని తెలిపారు.
ఎస్పి వెంట డిఎస్పి రాములు ,ఎస్.ఐ లు శ్యామ్ రాజ్, గంగాధర్ మరియు సిబ్బంది ఉన్నారు.



0 Comments