వృద్ధులు బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలి బీజేపీ నేత డా. వై అనూప్ రావు డిమాండ్

 


వృద్ధులు బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలి బీజేపీ నేత డా. వై అనూప్ రావు డిమాండ్


కోరుట్ల బస్టాండ్ వద్ద బీడీ కార్మికులతో బీజేపీ నాయకుల ధర్నా


 ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 10 : 


వృద్ధులు బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కోరుట్ల బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీడీ కార్మికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. 



ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానంలో బీడీ కార్మికులు, వృద్ధులను పక్కన పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు ఇంటూరి తిరుమల వాసు, గూగులవత్ శ్రీకాంత్, కలాల రాధా సాయిచంద్, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల తుక్కరాం గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, ఎండోమెంట్ కన్వీనర్ మాడవేణి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గిన్నెల శ్రీకాంత్, తులసి కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపల్లి సాగర్, మ్యాకల గణేష్, గందె నవీన్, మండల అధ్యక్షుడు పంచారి విజయ్ కుమార్, యువ మోర్చా అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి, వెంకటరెడ్డి రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మామిడి మల్లేష్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాచు రమేష్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎంఎస్ అక్మల్, మహిళా నాయకురాలు చెట్లపల్లి మమతతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments