కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రజా దండోర న్యూస్ / జూలై 25:
ఈ నేపథ్యంలో, ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్‌తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.
దీనికిముందు, కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయన రాజీనామాను డిమాండ్ చేశాయి.
రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ "మనం అనుకున్నది సాధించాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం సాధించి చూపించాం" అని అన్నారు

0 Comments