గడి బురుజులలో మైసమ్మ దేవాలయం నిర్మిస్తాం : కోరుట్ల బిజెపి పట్టణ శాఖ వెల్లడి - ప్రజా దండోర.


గడి బురుజులలో మైసమ్మ దేవాలయం నిర్మిస్తాం - కోరుట్ల బిజెపి పట్టణ శాఖ వెల్లడి.

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 26:


భారతీయ జనతా పార్టీ కొరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో  గడిబురుజుల స్థలాలు అక్రమానికి గురవుతున్న సందర్భంగా అ స్థలాలని కాపాడడానికి మరియు మైసమ్మ తల్లి దేవాలయం నిర్మాణం కొరకు భారతీయ జనతా పార్టీ కంకణబద్ధం మైసమ్మ దేవాలయం నిర్మిస్తాం అని వెల్లడించారు.

ఆదివారం పట్టణంలోని గడిబుజుల స్థలాన్ని పరిశీలించిన బిజేపి నాయకులు విఎల్టీ నెంబర్నిలను  రద్దుచేసి అక్కడి స్థలాన్ని కోరుట్ల పట్టణ ప్రజలకు చెందెలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంతో పురాతనమైన సాంప్రదాయ పకారంగా హిందూ ధర్మ బద్ధంగా పూజల అందుకుంటున్న మైసమ్మ తల్లి గుడి నిర్మాణం చేయాలని శపథం చేస్తూ  కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం పూజలు చేశారు.



 అనంతరం గడి స్థలాల రక్షణకై మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఆర్డిఓకు విన్నపం చేశారు

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎండోమెంట్ కన్వీనర్ మాడవేనీ నరేష్, కొ-కన్వీనర్ గోపికృష్ణ, పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, కోరుట్ల మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తిరుమల వాసు, పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపల్లి సాగర్, మ్యకల గణేష్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ధమ్మ సంతోష్ రెడ్డి, సోషల్ మీడియా బిజెపి ఇన్చార్జి ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments