రైతుల సుభిక్షం కోసం కొండగట్టు అంజన్నను ప్రార్థించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య



 


రైతుల సుభిక్షం కోసం కొండగట్టు అంజన్నను ప్రార్థించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలి


 రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, కొండగట్టు జూలై - 25 :


తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



జిల్లా పర్యటనలో భాగంగా కొండగట్టు హరిత హోటల్‌కు చేరుకున్న చైర్మన్‌కు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న చైర్మన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.



ఈ సందర్భంగా *ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ,*  కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దీక్షలు తీసుకుని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత అని పేర్కొన్నారు.



ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత, డీఎస్పీ రాములు , ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజకుమార్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ కిషోర్, డి.పి.ఆర్.ఆర్. వి.శ్రీధర్, తాశీల్దార్, ఈఓ అంజనా రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు,ఆలయ అధికారులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు



Post a Comment

0 Comments