అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిధులు - జువ్వాడి నర్సింగ్ రావు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 14:
పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.
మంగళవారం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన కోరుట్ల పట్టణం, మండలానికి చెందిన లబ్ధిదారులకు రూ.9,54,500 విలువైన 23 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.7.50 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రజల అవసరాలకు స్పందిస్తూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని జువ్వాడి సూచించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments