శాంతిభద్రతల పరిరక్షణలో వ్యూహాత్మక నైపుణ్యం అవసరం - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ - ప్రజా దండోర





శాంతిభద్రతల పరిరక్షణలో వ్యూహాత్మక నైపుణ్యం అవసరం - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్


సివిల్,ఆర్మ్డ్ రిజర్వ్, క్యూఆర్‌టీ (QRT) బలగాలకు 'మాబ్ ఆపరేషన్ డ్రిల్'పై శిక్షణ

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 14:


శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు బలగాలు సమన్వయంతో వేగంగా స్పందించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో సివిల్ పోలీసు, ఆర్మ్డ్ రిజర్వ్ (AR), క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) సిబ్బందికి *‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’* పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ గ్రౌండ్ లో  నిర్వహించారు. 



ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు, అల్లర్లు, నిరసనలు, సామూహిక ఘర్షణలు వంటి సందర్భాల్లో పోలీసు సిబ్బంది చట్టబద్ధంగా, సంయమనంతో, వ్యూహాత్మకంగా వ్యవహరించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అత్యంత అవసరమన్నారు.పోలీసు ప్రతి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, తగిన వ్యూహంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు సంయమనంతో వ్యవహరిస్తూనే, చట్టబద్ధంగా అల్లరి మూకలను అదుపు చేయాలి. నిరంతర సాధన ద్వారానే క్లిష్ట సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించగలం అని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసు సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో కూడా తరచూ ఇలాంటి శిక్షణలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.



ఈ శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి ప్రత్యక్ష అవగాహన కల్పించారు ,లాఠీ డ్రిల్ & ఫైరింగ్ గుంపులుగా చేరి అల్లర్లు సృష్టించే వారిని చెదరగొట్టే సమయంలో లాఠీఛార్జ్ చేసే విధానం, గ్యాస్ గన్ పేల్చే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.అల్లరి మూకలు ఆకస్మికంగా దాడికి దిగినప్పుడు, స్వీయ రక్షణ పాటిస్తూనే వారిని ఎలా నిలువరించాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు.


ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎస్పీ  పురుషోత్తం రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వేణు, సైదులు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, ,కరుణాకర్, రాజకుమార్, లక్ష్మీనారాయణ, ఎస్‌. ఐ లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments