రీ -సర్వే, నక్ష పనులు బాధ్యతయుతంగా నిర్వహించాలి
లైసెన్స్డ్ సర్వేయర్లకు దిశ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 13 :
సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లకు నక్ష, రీ - సర్వే పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఎపికైన లైసెన్స్డ్ సర్వేయర్లు 197 మంది చేయవలసిన పనులను సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు నక్ష, రీ - సర్వే కార్యక్రమాలలో పాల్గొని విధులు మరియు గౌరవ వేతనాల గురించి వివరించారు.
రీ - సర్వే మరియు నక్ష సర్వే లలో పాల్గొనని లైసెన్స్డ్ సర్వేయర్లు జూలై 20 లోపు విధులలో హాజరు కానట్లయితే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, సి సి ఎల్ ఏ ల ఆదేశాల మేరకు లైసెన్సులు తొలగిస్తామని అన్నారు.
అందరూ సరైన సమయంలో ప్రభుత్వం నిర్వహించే ముందు ముందు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్వే ఏడి కిషన్ ప్రసాద్, లైసెన్సుడు సర్వేయర్లు పాల్గొన్నారు.



0 Comments