రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావును సన్మానించిన డా. పేట భాస్కర్ - ప్రజా దండోర

 


రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావును సన్మానించిన డా. పేట భాస్కర్ 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ, జూలై 15:

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగ్ రావును ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డా. పేట భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు.



ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


డా. పేట భాస్కర్ వెంట తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంతడ్పుల గంగారాం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments