విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సంక్షేమ పాఠశాలల్లో మెనూ సమర్థవంతంగా అమలు చేయాలి - జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్




విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సంక్షేమ పాఠశాలల్లో మెనూ సమర్థవంతంగా అమలు చేయాలి - జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ 


ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 17:

 మేడిపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల (గురుకులం )ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ పాఠశాల (గురుకులం )లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా, సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ, కిచెన్ షెడ్ విధానాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. న్ని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా, సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ, కిచెన్ షెడ్ విధానాలపై ప్రత్యేకంగా పరిశీలించారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వారికి అందించే  భోజనం నాణ్యంగా, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. వంటశాలల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన పదార్థాలతో ఆహారం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.



సంక్షేమ పాఠశాలల్లో మెనూ సమర్థవంతంగా అమలు కావాలని అన్నారు.విద్యార్థులకు సురక్షితమైన, శుభ్రమైన వాతావరణంలో భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 


ఈ పరిశీలనలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, సంక్షేమ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా విద్యాధికారి కె. రాము, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ కన్నం హరిణి, తహసీల్దార్, ఎంపిడివో, మండల విద్యాధికారి, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments