హత్యకు గురైన కర్రే సునీత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - ప్రజా దండోర

 


హత్యకు గురైన కర్రే సునీత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


 బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, తక్షణ కర్తవ్యంగా  4,12,500 చెక్కతో ఆర్థిక సహాయం అందించిన మంత్రి


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, మెట్‌పల్లి, జూలై 21:


జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామంలో ఇటీవల మెట్ పల్లిలో దారుణ హత్యకు గురైన దళిత మహిళా కర్రే సునీత కుటుంబాన్ని మంగళవారం సాయంత్రం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి  పరామర్శించారు. 


ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



బాధిత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, మృతురాలి కుమారులు అచ్యుత్, అరుణ్ లకు చదువు పూర్తయ్యే వరకు వారి విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.4,12,500 విలువైన ఆర్థిక సహాయ చెక్కును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అందజేశారు.



ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ .. కర్రే సునీత హత్య కేసులో నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు చేపడతామని చట్టం ముందు అందరు సమానమే అని పేర్కొన్నారు.



అనంతరం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవని సతీష్ మాదిగ, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్, బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, బూర్గుల వెంకటేశ్వర్ లు మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు హత్య ఉదాంతం పై విజ్ఞప్తి చేయగానే వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారని ఈ విషయంలో దళిత సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో కూడా రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పెద్దన్నగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అండగా ఉండాలని కోరారు.



ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డివిజన్ రెవెన్యూ అధికారి నరసింహ రావు,  జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, డిఎస్పీ, సిఐ, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుల సంఘ నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments