నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల డిమాండ్ - ప్రజా దండోర

 


నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని - వామపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా


ఢిల్లీలో విద్యార్థులు యువకులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించాలి


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్, జగిత్యాల, జూలై 21:


రాజ్యాంగబద్ధమైన హక్కులను వినియోగించుకుంటూ ఢిల్లీలో విద్యార్థులు యువకులు నిరసన తెలుపుతూ ఉన్న వారిపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ నీటి పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సి.పి.ఐ, సిపిఐ ఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డ్రిమోకాసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు.



 ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 2014 నుండి 26 మధ్య 1502 జాతీయస్థాయి పరీక్షల పేపర్ లీకేజీలు అయినాయని వందలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు పర్యావరణ కార్యకర్త విద్యావేత్త అయిన సోనం వాగు చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 24 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కేంద్ర ప్రభుత్వం సందించకపోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనం అన్నారు కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం పై కేంద్ర మంత్రులు చర్చించి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించి నష్టపరిహారం ఇవ్వాలన్నారు అలాగే పేపర్ లీకేజ్ ల బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



  ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, సిపిఎం జిల్లా నేతలు రెల బాలకృష్ణ, కొంచెం శంకర్, సారంగపాణి, సిపిఐ ఎంఎల్ నేతలు చింత భూమేశ్వర్, నామాల లక్ష్మి, సిపిఐ జిల్లా నేతలు మునుగోరి హనుమంతు, కొక్కుల శాంత, అక్రమ భాష, ఎత్తండి భూమయ్య, ఎండి ఉస్మాన్, కిరణ్, రాజన్న, వెన్న మహేష్, సుజాత, పద్మ, యదలాపురం గంగరాజం, ఎండి సమీర్, పిట్టల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments