జాతీయ రహదారుల పై రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి : రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్



 


జాతీయ రహదారుల పై రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి : రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, జాతీయ రహదారులపై ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలి

జిల్లాల వారీగా రోడ్డు భద్రత చర్యలపై సమగ్ర నివేదికలు సమర్పించాలి, రోడ్డు భద్రత అంశాన్ని సుప్రీంకోర్టు అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోంది

 జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

 ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై-21:

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన రోడ్డు భద్రత చర్యలు అమలు చేయాలని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పనిచేసి సమర్థవంతమైన రోడ్డు భద్రత చర్యలు అమలు చేయాలని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

మంగళవారం హైదరాబాద్ నుంచి జాతీయ రహదారులపై రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతను పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు బీహార్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు మాత్రమే సుప్రీంకోర్టుకు అనుసరణ నివేదికలు సమర్పించాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరితగతిన చర్యలు తీసుకొని నివేదికలు పంపాలని సూచించారు.

జాతీయ రహదారులపై అనధికారిక పార్కింగ్‌ను పూర్తిగా నివారించాలని, పెట్రోలింగ్ వాహనాల నిర్వహణను బలోపేతం చేయడంతో పాటు భారీ వాహనాల కోసం అవసరమైన పార్కింగ్ స్థలాలను జాతీయ రహదారుల సమీపంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత శాఖల అధికారులతో వెంటనే సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం వెంటనే తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రులను మ్యాపింగ్ చేసి అత్యవసర వైద్య సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారుల పక్కన కొత్తగా మద్యం దుకాణాలకు ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి జిల్లా రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలపై సమగ్ర కార్యాచరణ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రోడ్డు భద్రత అంశాన్ని సుప్రీంకోర్టు అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని శాఖల సమన్వయం, పోలీసు సహకారం అందేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని అనుసరణ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో  రవాణా శాఖ అధికారి సంధాని ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments