కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం - జువ్వాడి కృష్ణారావు


 

కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం 


 నీట్ పేపర్ లీకేజీ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు 


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూలై 22:


 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగారావుల ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణ కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు.





 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు విచ్చేసి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగబద్ధమైన హక్కులను వినియోగించుకుంటూ  శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీ బల ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాల వల్ల లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నీట్ పేపర్ లీకేజీ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


 ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు తోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, ధర్మారం సర్పంచ్ దొడ రంజిత్ రెడ్డి, అయిలాపూర్ సర్పంచ్ ద్యావనపల్లి రామకృష్ణ, చిన్న మెట్పల్లి సర్పంచ్ రహీం, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments