ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూలై 23:
గురువారం జగిత్యాల, దరూర్ క్యాంపులోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వసతి గృహంలోని విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా కిచెన్ షెడ్ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా నిర్మించాలని నిర్మాణం పనులలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, గుత్తే దారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


0 Comments