కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన జగిత్యాల విద్యార్థులను అభినందించిన కరీంనగర్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ అలామ్

 


కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన జగిత్యాల విద్యార్థులను అభినందించిన కరీంనగర్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ అలామ్ 


జగిత్యాల జిల్లా కు చెందిన నలుగురు విద్యార్థులు కరాటే లో సత్తాచాటి బ్లాక్ బెల్ట్ సాధించారు.


ప్రజా దండోర న్యూస్ / కరీంనగర్ జిల్లా ప్రతినిధి, జూన్ 05:


కరీంనగర్ లోని వివేకానంద రెసిడెన్సియల్ స్కూల్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీల్లో జగిత్యాల ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రధాన శిక్షకుడు మర్రిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎస్.చక్రి ,కె. సాయి చరణ్, బి. సౌమిత్ రాజ్, కె. చైతన్య విశేష ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నారు.

ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ &  చీఫ్ ఎగ్జామినర్ కే వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులకు బెల్ట్ మరియు సర్టిఫికెట్ లను ప్రధానం చేశారు. బ్లాక్ బెల్ట్ సాధించిన జగిత్యాల విద్యార్థులను కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ అలం ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని ముఖ్యంగా యువత వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని అమ్మాయిలు ఆత్మ రక్షణ విద్య కరాటే తప్పనిసరిగా నేర్చుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ మరిపెల్లి లింగయ్య, ఎంఏ మన్నన్, అనంతుల కాంతారావు, నరేష్, రాజశేఖర్, సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments