మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ - ప్రజా దండోర




మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


నిర్మాణంలో ఉన్న నూతన భవన పనుల పురోగతి పరిశీలన


భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించిన కలెక్టర్ 


ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, జూన్ 16


మంగళవారం మెట్ పెల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 




ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత పరిస్థితులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులు, ఔషధ నిల్వ గదులను తనిఖీ చేసి రోగులకు అవసరమైన మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్యులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.





అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని సందర్శించి జరుగుతున్న పనులలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




 ఈ పరిశీలనలో మెట్ పెల్లి ఆర్డీవో నరసింహ రావు, జిల్లా ఆసుపత్రి కో- ఆర్డినేటర్ రామకృష్ణ, ఆసుపత్రి సూపరిండెంట్ సాజిద్ అహ్మద్,  ఎమ్మార్వో నీత, వైద్యులు మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments