జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం విజయవంతం
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 15:
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఐ.ఏ.ఎస్. గారి అధ్యక్షతన జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం సోమవారం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు డా. కె. సంజయ్ (ప్రత్యేక ఆహ్వానితులు), మరియు మెంబర్-కన్వీనర్ డా. ఎం.జి. కృష్ణమూర్తి (మెడికల్ సూపరింటెండెంట్) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి ప్రస్తుత ఓపి (OP), ఐపి (IP) సేవలు మరియు శస్త్రచికిత్సల (Surgeries) పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నిధుల ద్వారా ఆసుపత్రికి అవసరమైన నూతన ఆధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు మరియు ఆసుపత్రిలో క్లినికల్ సేవలను మెరుగుపరచడంతో పాటు, రోగులతో సిబ్బంది కమ్యూనికేషనన్ను పెంపొందించి మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్, ప్రిన్సిపాల్ GMC Jagtial, DM&HO, DCHS, Jagtial గార్లు, CS RMO, బోధనా సిబ్బంది, వీరితో పాటు సామాజిక మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుగా శ్రీమతి డి.సరోజ (జిల్లా మహిళా సమాఖ్య), టి.వి. సూర్యం (రోటరీ క్లబ్), మంచాల కృష్ణ (రెడ్ క్రాస్ సొసైటీ), శ్రీమతి యు.రజిత (SHG సభ్యురాలు), కె.రవీందర్ (పెన్షనర్ల సంఘం) మరియు ఆసుపత్రి సిబ్బంది హాజరయారు.



0 Comments