కోరుట్లలో దళిత కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం, మరింత ఎదగాలని నాయకుల ప్రోత్సాహం - ప్రజా దండోర

 


కోరుట్లలో దళిత కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం మరింత ఎదగాలని నాయకుల ప్రోత్సాహం 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, జూన్ 11:

"స్వేచ్ఛ" సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ లు మోర్తాడ్ లక్ష్మినారాయణ, పొట్ట సురెంధర్, తెడ్డు శ్రీజ విజయ్, చిట్యాల లక్ష్మినారాయణ లకు ఆత్మీయ సన్మానం చేశారు.




ఈసందర్భంగా పాల్గొన్న అంబేద్కర్ సంఘాల నాయకులు అభ్యుదయ రచయిత కవి రాస భూమయ్య, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ లు మాట్లాడుతూ రాజకీయ రంగాలలో ప్రజల మన్నననలు పొంది ప్రజాప్రతినిధులు గా ఎదిగిన కౌన్సిలర్ లు మరింత ఉన్నతమైన పదవులకు ఎదగాలని ఆకాంక్షించారు.




ఈకార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు భూపెల్లి నాగేశ్వర్రావు, అల్లం మొగిలి, సామల్ల దశరథం, అత్మీయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments