కోరుట్ల గడి స్థలాల రక్షణ మన బాధ్యత - సీనియర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు సోగ్రబి, మోర్తాడ్ లక్ష్మీ నారాయణలు వెల్లడి - ప్రజా దండోర

 


కోరుట్ల గడి స్థలాల రక్షణ మన బాధ్యత - సీనియర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు సోగ్రబి, మోర్తాడ్ లక్ష్మీ నారాయణలు వెల్లడి

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 12 :

పురాతన కోరుట్ల గడి స్థలాల రక్షణ మన అందరి బాధ్యత అని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని 17, 3 వ వార్డు కాంగ్రెస్ సీనియర్ కౌన్సిలర్ లు సోగ్రబి,  మోర్తాడ్ లక్ష్మీ నారాయణ లు వెల్లడించారు. 

మంగళవారం అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు గడి బురుజుల స్థలాల్లో వేసిన విఎల్టీలను రద్దు చేయాలని చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేసిన కౌన్సిలర్ లు పై విధంగా స్పందించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్ యార్డు, పార్కు, మైసమ్మ దేవాలయం నిర్మాణం చేసి కోనేరును అభివృద్ధి చేయాలని కోరారు.

ఈ సంతకాల సేకరణలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, షాహెద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments