కోరుట్ల మున్నూరు కాపుల ఐక్యతతో పాటు పట్టణ అభివృద్ధి కి కృషి చేస్తాం - కాపు కౌన్సిలర్లు..ప్రజా దండోర


కోరుట్ల 
మున్నూరు కాపుల ఐక్యతతో పాటు పట్టణ అభివృద్ధి కి కృషి చేస్తాం - కాపు కౌన్సిలర్లు..

- కౌన్సిలర్లను ఘనంగా సన్మానం చేసిన సిద్ధి వినాయక సంక్షేమ సంఘం నాయకులు

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 12 :

 కోరుట్ల పట్టణంలోని సిద్ధి వినాయక మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన మున్నూరుకాపు కౌన్సిలర్లకు ఆత్మీయ అభినందన సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు..

 ఈ సందర్భంగా పుప్పాల ప్రభాకర్ - ఉమాదేవి, శీలం వేణుగోపాల్ - జయలక్ష్మి, కస్తూరి లక్ష్మి నారాయణ - వాణి, టేకులు నరేష్ - శిరీష, తోట గంగాధర్ - లక్ష్మి, యాటం పద్మ (చిట్టీ) గార్లను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్నూరుకాపులు ఐకమత్యంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధి తో పాటు తమ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షులు పైకారి రవీందర్, అధ్యక్షులు అన్నం యాదగిరి, ఉపాధ్యక్షులు టేకుల నరేష్, చింతామణి ప్రభాకర్, కార్యదర్శి తక్కూరి భాస్కర్, సహాయ కార్యదర్శి కె. ప్రభాకర్, కోశాధికారి దావేరి పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు సోవినవేణి రాములు, గండ్ర మల్లేశం, కూర దేవేందర్, పాము సాయిలు, గోనెల రాజశేఖర్, గందె వినోద్, గండ్ర మహీధర్, గౌరవ సలహాదారులు పుప్పాల ప్రభాకర్, తుంగూరి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments