జాతీయస్థాయి జర్నలిస్ట్ మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డిఎస్పీ రాములు
ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 19 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు మెట్ పల్లి డిఎస్పీ అడ్లూరి రాములు వారి కార్యాలయంలో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (ఎన్ యు జే ఐ ) అనుబందంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ ఎస్ జే యూ ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహాసభలు ఏప్రిల్ 23,24 తేదీన హైదరాబాద్ వేదికగా జరుగునున్న సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డిఎస్పీ అడ్లూరి రాములు యూనియన్ నాయకులతో కలిసి దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించుకోవాలనే ప్రధాన లక్ష్యం తో అన్ని రాష్ట్రాల నుండి జర్నలిస్ట్లు హాజరై హైదరాబాద్ వేదికగా మహాసభలు నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు దీకొండ మురళి, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గట్ల శ్రీనివాస్, కో కన్వినర్ బెజ్జరాపు వినోద్ కమిటీ సభ్యులు నన్నాపు రాజు రవిరాజు, గుండవేణి రమేష్, గట్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments