కోరుట్ల మునిసిపల్ కమిషనర్ వల్ల అవినీతికి అడ్డగా మారిన పురపాలకం.. ఇప్పుడైనా సస్పెండ్ చేస్తారా..?
- కోరుట్ల ప్రభుత్వ గడి స్థలాలలో నకిలీ దస్తావేజులకు దాదాపు 80 లక్షల లంచాలతో 5,040 గజాలకు విఎల్టీలు వేసిన ఘనుడు, మరిన్ని వేల గజాలకు ప్లాన్ చేస్తున్న వైనం..
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కోరుట్ల కమీషనర్ పై అవినీతి ఆరోపణలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ జూన్ 2025 లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దాదాపు లక్ష మంది జనాభా తో విశాలమైన ప్రభుత్వ స్థలాలతో చాలా వరకు ఆర్థికంగా ఎదిగిన వ్యాపారులు, రియల్టర్లు, ముఖ్యంగా మంచిని నమ్మి జీవించే మధ్యతరగతి, నిరుపేద వర్గాలతో విలసిల్లే ఈ పట్టణంలో మోసానికి పరాకాష్ట గా మారిన వైనంపై ఈ పాటికే కోరుట్ల ప్రజలు, యువత, పాత్రికేయులు ఆధారాలతో సహా కమీషనర్ మోసాలపై ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులను చూసైనా ఉన్నతాధికారులు కమీషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- కమీషనర్ కు సంబంధించిన అవినీతి ఆరోపణలు కొన్ని సాక్షాదారలతో సహా అధికార పక్షం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మీ ముందు పెడుతున్న ఆధారాలు ఇప్పుడైనా ఉన్నతాధికారులు ఈ కమిషనర్ ను సస్పెండ్ చేస్తారా లేక పైసలకు అమ్ముడు పోతారా చూద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
సారు సెక్రటేరియట్ ఆఫీస్ నుండి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తను ప్రజలకు మేలు చేస్తున్న అని సిమెంట్ బ్యాగులు కంకర కొని అవగాహన లేని మున్సిపల్ లేబర్ లతో రాత్రిపూట ఎవరికీ తెలియకుండా సిసి రోడ్లు మరియు మోరీలు ప్యాచ్ వర్క్ లు చేపిస్తూ లేబర్ల జీవితాన్ని పణంగా పెట్టి సార్ డబ్బులు జేబులు నింపుకున్నాడు దానికి సంబంధించిన పేపర్ కటింగ్ జతపరచడమైనది..
2) ఎలాంటి టెండర్ లేకుండా తనకు నచ్చిన కాంట్రాక్టర్ తో మన కోరుట్ల మద్దెల చెరువు గుర్రపు డెక్క పేరుతో సార్ 10 లక్షలు తన జేబులో వేసుకున్నారు దానికి సంబంధించిన పేపర్ క్లిప్ కూడా జతపరచడమైనది.
3) ఇల్లు కట్టుకోవడం పేదవాని కల అట్టి కలను అది లోనే తుంచి కార్యాలయం లొని ప్రవైట్ లైసెన్స్ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టి 10000 ఇస్తేనే పర్మిషన్ ఇస్తా అని చెప్పి లైసెన్స్ ఇంజనీర్స్ ని బెదిరించడం కూడా జరిగినది దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా జతపరచడం జరుగుతున్నది.
4) సార్ ఇంత అవినీతి పరుడో ఇందులో పెట్టే ప్రూఫ్ తోని మీకు తెలుస్తుంది మన గ్రామకంఠ స్థలం లో మనం చిన్నప్పటి నుంచి నరకాసురులను కాలుస్తున్న స్థలాన్ని ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఒక స్పీక్ అవుట్ నోటీసు ఒక వీలునామాతో 5,040 గజాలకు నెంబర్ వేసి మన కోరుట్ల ప్రజల ఆస్తిని అమ్ముకున్న కమిషనర్ ఇన్ని సాక్షలతో బయటకు వచ్చినా కూడా కమిషనర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇట్టి కమిషనర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు రాజకీయ ఒత్తిడి వలన పై అధికారులు కూడా అమ్ముడు పోవడం వలన మన కోరుట్ల ఆస్తి అంటే చిన్న చూపు ఉన్న అధికారులపై చర్యలు ఉండవా ఇప్పుడైనా మన కొరుట్ల ప్రజలు అందరం కనులు తెరిచి ఈ కమిషనర్ పై చర్యలు తీసుకొనే విధంగా పోరాటం చేసి ఇట్టి విఎల్టీలను రద్దు చేపించి కమిషనర్ను విధుల నుంచి తొలగించడానికి మనందరం కృషి చేద్దాం. ఇట్టి అవినీతికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ కూడా జతపరచడం జరిగినది.
5) కోరుట్ల మున్సిపల్ నందు ఐదు తర్వాత చీకటి ఒప్పందం స్టార్ట్ అవుతుంది పట్టణంలో సంబంధించిన బిల్డింగులు, లేఅవుట్లు, అనధికారిక నిర్మాణాలు పంచాయతీలను టీ పి ఓ, టీపీఎస్ సహకారంతో రాత్రి వేళలో ఇలాంటి పై చర్చలు జరిపి తెల్లవారి వాళ్ళ దగ్గర అక్రమ వసూలు చేస్తూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ జతపరచడమైనది.
6) కార్యాలయంలో అంత అవినీతి రాజ్యము ఎలుతుంది ఇంజనీరింగ్ సెక్షన్ లో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న సార్ కి ఎఇ ఇంచార్జ్ గా ఇచ్చి అక్రమంగా సంపాదిస్తున్నారు.
ఇక మోటేషన్ విషయానికి వస్తే సార్ 5000 లేంది ఫైల్ ముట్టడం లేదు అందులో కొంచెం తప్పిదమున్న 50 వేల నుంచి లక్ష కూడా వసూలు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది.
7) ఇటు కమిషనర్ గారు ఒక మహిళ పాశుద్ధ కార్మికురాలపై లైంగిక వేధింపులు జరిగిన పట్టించుకోలేదు చివరికి ఆ మహిళ పారిశుద్ధ కార్మికురాలు ఒక రాజకీయ నాయకుని కలవడం వల్ల తనకు న్యాయం జరిగినది ఇట్టి విషయంలో కమిషనర్ మహిళను ఎందుకు రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళామని బెదిరింపులకు పాలు పడడం కూడా జరిగినది.
8) ఇంతకు ముందు కోరుట్ల పురపాలక సంఘం లో పనిచేసిన ఒక దళిత కమిషనర్ తన ఆఫీస్ నెంబర్ కి అనుకోకుండా మద్యం బాటిల్ తో వచ్చిన ఫోటో ఉన్నందున అతని సస్పెండ్ చేయడం జరిగినది ప్రస్తుత కమిషనర్ రవీందర్ గురించి ఎన్ని ఫిర్యాదులు ఎన్ని సామాజిక మాధ్యమంలో మెసేజ్లు, దినపత్రికలలో కమిషనర్ పై అవినీతి విషయాలు వచ్చినా కూడా చర్యలు లేకపోవడం పై అధికారుల అసమర్థత వల్ల చర్యల లేక అమ్ముడుపోయినారా లేక వీరు కూడా కమిషనర్ తో కలిసిపోయారా? లేక రాజకీయాలకు లొంగిపోయినారా..
ఇట్టి కమిషనర్ చేసిన అవినీతికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ అన్ని జతపరచడం జరుగుతుంది కావున కోరుట్ల ప్రజలారా మేల్కొని ఇట్టి కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకునే లాగా మనందరం పోరాడుదాం మన కోరుట్ల గడి బురుజుల స్థలాలను మనం కాపాడుకుందాం. ఇంత అవినీతిపరుడైన కమిషనర్ పైన పార్ట్ 1 పార్ట్ 2 రావడం వల్ల పైఅధికారులకు ఇన్ఫర్మేషన్ లేకుండా కార్యాలయానికి సెలవు పెట్టి ఎటు వెళ్లినట్టు...? జై కోరుట్ల, బచావో కోరుట్ల..!


0 Comments