శ్రీ రామనవమి సందర్భంగా శ్రీవల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో సీతమ్మవారికి పట్టువస్త్రాలు.


శ్రీ రామనవమి సందర్భంగా శ్రీవల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో సీతమ్మవారికి పట్టువస్త్రాలు. 

ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి :

 శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని కోరుట్ల శ్రీ శివమార్కండేయ కోటినవ దుర్గ దేవాలయం నుండి సీతమ్మవారికి తలంబ్రాలు, ఒడిబియ్యం, సారె, పట్టు వస్త్రాలు శ్రీవల్లి సేవాసంస్థ సేవకులు సుమారు 500 మంది పాల్గొని కోలాటం, నృత్య ప్రదర్శనలతో,ఊరేగింపుగా శ్రీ సీతారామాలయం వరకు తీసుకెళ్లారు. 

ఈకార్యక్రమంలో పద్మశాలి సంఘ అధ్యక్షులు గుంటుక ప్రసాద్, దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనుంజయ్, సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, డైరెక్టర్లు పడాల గణేష్,యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ డైరెక్టర్ ఆడెపు నరేష్ కుమార్, యువత సహాయ కార్యదర్శి రాడం మహేందర్, సీతారామాలయ చైర్మన్ వనతడుపుల మురళి, శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, ముక్క దామోదర్, అడ్వాల ప్రభాకర్, చిద్రాల రాము, సంకట మల్లయ్య, భీమనాతి రవి, జడల సమ్మయ్య, శ్రీవల్లి సేవా సంస్థ సభ్యులు పుష్పలత, జమున తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments