భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. వై. అనూప్ రావు



భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. వై. అనూప్ రావు 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి  :

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డా. వై. అనూప్ రావు ను తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు N. రామచంద్ర రావు నియామించారు. ఈ సందర్భంగా మంగళవారం కోరుట్లలో డా.వై అనూప్ రావు పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 

 తనపై నమ్మకంతో పార్టీ అధిష్టానం అప్పగించిన రాష్ట్ర స్థాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ నియామకానికి సహకరించిన ఇందురు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు లకు డా.వై అనూప్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 అనంతరం డాక్టర్ వై అనూప్ రావు బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు తిరుమల వాసు, రుద్ర సుజాత, కలాల రాధ సాయిచందు, గూగులోతు శ్రీకాంత్, కోరుట్ల మండల ప్రెసిడెంట్ పంచరీ విజయ్, కోరుట్ల టౌన్ సెక్రెటరీ రాజేందర్, సాగర్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ లింగారెడ్డి, సుధావేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, బేక్కం అశోక్, మ్యాకల గణేష్, తులసి కృష్ణ, మాడవేణి నరేష్, పెండెం గణేష్, రాగంశెట్టి సాయి తదితరులు డా. అనూప్ రావుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments