జమ్మూ లో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ (ఖో ఖో) పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్
-రమేష్ ను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్
ప్రజా దండోర న్యూస్ / ప్రతినిధి పేట ప్రభాస్ :
జమ్మూ & కాశ్మీర్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ (ఖో ఖో) పోటీలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫున జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ విశేష ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అల్లం రమేష్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలలో తెలంగాణ పోలీస్ తరుపున పాల్గొని విజయాన్ని సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు .

0 Comments