మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్


మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ :

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. 

స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రజాప్రతినిధులకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని తెలిపారు.

యువత మహనీయుల సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నాయకుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డీఆర్‌డీవో రఘువరన్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి కె. రాజ్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సునీత, డీసీవో మనోజ్ కుమార్, డీఈవో కె. రాము, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రవి కుమార్, డీపీఆర్‌వో పి. నరేష్ తదితర జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments