జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్ధిల్ల శ్రీపాద రావుకు ఘన నివాళులు
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు గారి జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు గారి చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల అంకితభావం కలిగిన ప్రజానాయకుడిగా ఆయన గుర్తింపుపొందారని ఈ సందర్భం గా అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో SB డిఎస్పి వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రవీందర్, శ్రీధర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


0 Comments