కొండగట్టులో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజా దండోర న్యూస్ / గాజుల శ్రీనివాస్ గౌడ్ / ధర్మపురి ఇంచార్జీ :
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఒక అడుగు ముందున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ నోటిఫికేషన్ కు ముందే ప్రచార ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రచారం ప్రారంభించడానికి మంత్రి ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ముఖ్యులతో కలిసి ప్రచార రథానికి కొండగట్టులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
0 Comments