జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి- మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి-మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :  

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని  పునరుద్దరించాలని  మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తాటిపర్తి శోభారాణి అన్నారు.  

 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం  బతికేపల్లి గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో మంగళవారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభారాణి అధ్యక్షతన సమావేశం జరుగగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి,పెగడపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సింగసాని విజయలక్ష్మి లు హాజరయ్యారు. 

ఈ సందర్బంగా శోభారాణి మహిళా కూలీలనుద్దెశించి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు.  

మహాత్మా గాంధీ  మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడని ఆమే కొనియాడారు.ఉపాధిహామీ పథకానికి గాంధీ  పేరు లేకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుoదని  శోభారాణిలు  ఆరోపించారు. ఎంతోకాలంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాల ఫలితంగా ఎంజిఎన్ఆర్ఇజిఎఎస్  రూపుదిద్దుకుందని,ప్రతి చేతికి పని,  పనికి తగ్గ వేతనం అనే హామీ ఈ పథకం ద్వారా ప్రజలకు సిద్ధించిoదని శోభారాణి తెలిపారు.

గ్రామీణ భారతంలో పని కోరుకునే వారికి చట్టబద్ధమైన హక్కును కల్పించిందని ఆమే గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 100 రోజులు ఉపాధికి కూలీలకు భరోసా కల్పిస్తూ హామీ ఇచ్చిందని,  వికేంద్రీకృత పాలనను బలోపేతం చేసిందని శోభారాణి ఉద్గాటించారు. మహిళలు, భూమిలేని నీరుపేదలను శక్తివంతం చేసిందని ఆమే కొనియాడారు. 

ఇంతటి మహోన్నత పథకానికి  జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెడితే ఓర్వలేని బిజెపి ప్రభుత్వం, అయన పేరును తొలగించాలని నిర్ణయం తీసుకొని,  గాంధీజీ పేరు మార్పు,  విలువల పట్ల ఉన్న దీర్ఘకాల అసౌకర్యాన్ని ఆ నమ్మకాన్ని ప్రతిబింబించేలా చేస్తుందని  శోభారాణి ఆరోపించారు. ప్రజాకేంద్రిత సంక్షేమ చట్టంతో జాతిపితకు ఉన్న అనుబంధాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె దుయ్యాబట్టారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి బిల్లులను ప్రవేశ పెట్టడం  అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఉద్దేశ పూర్వకమైన అడుగు వేసింది చరిత్రత్మకమైన హక్కుల ఆధారిత ప్రజల చట్టాన్ని బలహీనపరచడం భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన సంక్షేమ చట్టం నుండి మహాత్మా గాంధీ  పేరు విలువలను తొలగించేందుకు చేసిన రాజకీయ కుట్ర అని ఆమె విమర్శించారు. అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం వ్యవహరించడం ప్రజా వ్యతిరేకమని శోభారాణి  పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  శోభారాణి డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో బతికేపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి మధుకర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు సింగసాని విజయలక్ష్మి, మహిళల పాల్గొన్నారు.

Post a Comment

0 Comments