మోగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నగారా
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి :
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 రెండో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు కీలక తేదీలను ప్రకటించింది.
ముఖ్య తేదీలు ఇవే:
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: 28-01-2026 (బుధవారం)
నామినేషన్ల స్వీకరణ: 28-01-2026 నుండి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 30-01-2026 (శుక్రవారం) సా.5.00 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన: 31-01-2026 (శనివారం) ఉదయం 11.00 గంటల నుంచి
చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా: 31-01-2026
నామినేషన్ తిరస్కరణపై అప్పీల్: 01-02-2026 (ఆదివారం) సా.5.00 గంటల వరకు
అప్పీల్స్ పరిష్కారం: 02-02-2026 (సోమవారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 03-02-2026 (మంగళవారం) సా.3.00 గంటల వరకు
తుది అభ్యర్థుల జాబితా విడుదల: 03-02-2026
పోలింగ్ తేదీ: 11-02-2026 (బుధవారం) ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 వరకు
రీ–పోల్ (అవసరమైతే): 12-02-2026 (గురువారం)
ఓట్ల లెక్కింపు: 13-02-2026 (శుక్రవారం) ఉదయం 8.00 గంటల నుంచి
ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే
ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని విడుదల చేశారు.

0 Comments