మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన -అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపిఎస్

 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :

మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో కోరుట్ల,రాయికల్  పట్టణాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను, పలు పోలింగ్ కేంద్రాల ను అదనపు ఎస్పి శేషాద్రిని రెడ్డి ఐపీఎస్  పరిశీలించారు.

అక్కడ కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు.అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.  

అదనపు ఎస్పీ వెంట డిఎస్పి అడ్లూరి రాములు, కోరుట్ల సీ.ఐ సురేష్ బాబు, కోరుట్ల , రాయికల్ ఎస్సై లు ఎం చిరంజీవి, సుధీర్ రావు లు ఉన్నారు.

Post a Comment

0 Comments