రోడ్డు భద్రత మాస వారోత్సవాలు –2026, వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి ఎం శ్రీనివాస్


రోడ్డు భద్రత మాస వారోత్సవాలు –2026, వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి ఎం శ్రీనివాస్

ప్రజా దండోర న్యూస్ / ప్రతినిధి జానకిరామ్ :

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన రోడ్డు భద్రత మాస వారోత్సవాలు–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో వ్యాసరచన పోటీని నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను తమ వ్యాసాల ద్వారా చక్కగా వివరించారు.

ఈ పోటీలో జిల్లా కేంద్రం లోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు డి.మోక్ష ప్రథమ బహుమతిని, ఎస్.శ్రీనిధి ద్వితీయ బహుమతిని సాధించారు. విజేతలకు జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రమీల, అభిలాష్, రియాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. విద్యార్థులలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా చిన్న వయస్సు నుంచే భద్రతపై అవగాహన పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు రవాణాశాఖ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment

0 Comments