బుగ్గారం శ్రీ గ్లోబల్ హైస్కూల్లో భరోసా కార్యక్రమం
ప్రజా దండోర న్యూస్ / బుగ్గారం ప్రతినిధి
ప్రస్తుత సమకాలిన అంశం మైనర్ బాలికలపై మానవ కామ మృగాల లైంగిక దాడులను గురించి మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులచే ప్రభాత్-బేరి మరియు గ్రామ కూడాలిలో మానవహారాన్ని నిర్వహిస్తూ భరోసా కార్యక్రమాన్ని బుగ్గారం ఎస్సై జి .సతీష్ అధ్యక్షతన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మరియు పోషకులకు గుడ్ టచ్-బాడ్ టచ్, ఫోక్సొ చట్టాలు. గాంజాయి,డ్రగ్స్, మొబైల్ యాప్స్ అంశాలను గురించి జాగ్రత్తతో కూడిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం హరీష్. జిల్లా భరోసా సపోర్ట్ పర్సన్ శ్రీమతి సుజాత ,లీగల్ అడ్వైజర్ పద్మ ,బుగ్గారం సర్పంచ్ శ్రీమతి నక్క రాజవ్వ రాజయ్య, ఉప సర్పంచ్ శ్రీమతి జంగ లావణ్య శ్రీనివాస్. తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి మూల సుమలత శ్రీనివాస్ గౌడ్. పెద్దలు చుక్క గంగారెడ్డి,పాఠశాల ప్రిన్సిపాల్ నక్క రాజు ,కరస్పాండెంట్ శ్రీమతి స్వాతి, వైస్ ప్రిన్సిపల్ పూజ. ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


0 Comments