తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

 


ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి..

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉద్యమకారుల భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం

250 గజాల స్థలం.. గుర్తింపు కార్డుతో పెన్షన్ సౌకర్యం కల్పించాలి

ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్

ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, సెప్టెంబర్ 30 : 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. 

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డుతో పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన ఇతర హామీలను కూడా నెరవేర్చాలని ఆయన కోరారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన వారిని ప్రభుత్వం గుర్తించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నేడు హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం

ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు, వారి సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం ఆధ్వర్యంలో ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు డా. పేట భాస్కర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఉద్యమకారుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, ప్రభుత్వం నుంచి హామీల అమలుకు తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని డా. పేట భాస్కర్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments