సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి - డా. పేట భాస్కర్
గవర్నర్ కోటాలో తెలంగాణ ఉద్యమ నేత గజ్జల కాంతం కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి
నవంబర్ 18 న తెలంగాణ ఉద్యమకారులతో భారీ బహిరంగ సభ
తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, సెప్టెంబర్ 30 :
తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమ నేత గజ్జెల కాంతంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఉద్యమ నేత గజ్జెల కాంతంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సమావేశం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని గుర్తించి, సిఎం రేవంత్ రెడ్డి ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని సమావేశంలో పలువురు ఉద్యమ కారులు అభిప్రాయాలు వ్యక్త పరిచారు.
తెలంగాణ ఉద్యమకారులతో కలిపి నవంబర్ 18 వ తేదీన హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రులను మరియు కేకే కమిటీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
ఈసమావేశంలో డా. పేట భాస్కర్ తో పాటు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చైర్మన్ డాక్టర్ సీమ శ్రీనివాస్, గంధం రాములు, డాక్టర్ జే ఎన్ వెంకట్, సంజయ్ నాయక్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల అజయ్, రాష్ట్ర కార్యదర్శి కుక్క చంద్రమౌళి,గొస్కి శంకర్, ప్రభాకర్, షాహేద్ మహ్మద్ షేక్, ముజాహిద్, ఉద్యమ కారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



0 Comments