మెట్ పల్లిలో రెండు రోజులు కొనసాగిన గణేష్ నిమజ్జన మహోత్సవాలు
బుధవారం ప్రారంభమైన నిమజ్జనాలు.. వర్షం కారణంగా గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగింపు..
పోలీసుల సూచనల మేరకు నిమజ్జన ప్రక్రియ పూర్తి
ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి, సెప్టెంబర్ 24 :
పట్టణంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు వర్షం కారణంగా గురువారం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లను వినియోగిస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. భారీ విగ్రహాల నిమజ్జనం కారణంగా ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుండటంతో గురువారం మధ్యాహ్నం వరకు కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
నిమజ్జన కార్యక్రమం సజావుగా పూర్తయ్యేలా జిల్లా ఎస్పీ, ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి, సీఐ, ఎస్సై పబ్బ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి, భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన ప్రాంతంలో పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా!

0 Comments