నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య.. కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన వ్యక్తి
ప్రజా దండోర న్యూస్ / నిజామాబాద్, సెప్టెంబర్ 17 :
నిజామాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో గురువారం దారుణ హత్య చోటుచేసుకుంది. గత వారం రోజులుగా అదే ప్రాంతంలో మొక్కజొన్న కంకులు అమ్ముతు జీవిస్తున్న కోరుట్లకు చెందిన య్యూటబర్ వైష్ణవి భర్త హరిబాబు కాలినడకన రోడ్డుపై నడుస్తూ హోటల్ వద్ద నీళ్లు తాగేందుకు ఆగగా కారులో నుండి దిగిన వ్యక్తి నేరుగా వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారైయ్యాడు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో వచ్చిన వ్యక్తులలో ఒకే వ్యక్తి కారులో నుండి దిగి హరిబాబుపై కొబ్బరి బొండాల కొట్టే కత్తితో దాడి చేసి అనంతరం అదే కారులో పరారైనట్లు అక్కడ ఉన్న సిసి ఫుటేజ్ వీడియో పలు సోషల్ మీడియా గ్రూపులలో సంచలనం సృష్టిస్తుంది.
భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు
మృతుడు హరిబాబు ఐదు నెలల క్రితం జరిగిన తన భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు కొద్దికాలానికే హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.
పాత కక్షలే కారణమా?
హరిబాబు హత్యకు పాత కక్షలే కారణమా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఘటనా స్థలానికి పోలీసులు
హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, రాజా రాజేంద్ర చౌరస్తా పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.


0 Comments