పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా.. కోరుట్ల మున్సిపల్ లో ‘ఇంకుడు గుంత వినాయకుడు’
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 14:
ప్రజల్లో పర్యావరణం మరియు భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించేందుకు కోరుట్ల పురపాలక సంఘంలో వినూత్నంగా "ఇంకుడు గుంత వినాయకుడిని" ప్రతిష్టించారు. "ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకుందాం - ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం" అనే సామాజిక నినాదంతో ఈ కాన్సెప్ట్ మండపాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వినాయకునికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వసంత తిరుమల, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ అరుణ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఇంచార్జ్ ఆర్.ఐ అక్షయ్, ఇంచార్జ్ సానిటరీ స్పెక్టర్ అశోక్ పర్యావరణ ఇంజనీర్ మహేష్ మరియు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు ఇన్‌చార్జ్ కమిషనర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాబోయే నీటి సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రజలు సహకరించి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పచ్చదనం కోసం ప్రతి ఇంటా మొక్కలు నాటాలని కోరినారు.


0 Comments