నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందిన రాగిని భాస్కర్ కు ఘన సన్మానం

 




నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా రాగిని భాస్కర్ బాధ్యతల స్వీకరణ

పదోన్నతి పొందిన సందర్భంగా కోరుట్లలో ఘన సన్మానం

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, సెప్టెంబర్ 13: 

కోరుట్ల పట్టణానికి చెందిన రాగిని భాస్కర్ కాగజ్‌నగర్ గిరిజన అభివృద్ధి సహాయ అధికారిగా సేవలందించిన అనంతరం నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆదివారం కోరుట్ల మున్నూరు కాపు జేఏసీ కార్యాలయంలో ఆయన ను ఘనంగా సన్మానించారు.


తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిశేట్టి గంగారెడ్డి, మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారి శంకర్, రేగుల మోహన్, ఇట్యాల రాజేందర్, ఆకుల మదన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీరాముల అమరేందర్, మోర్తాడ్ రాజశేఖర్, ఎం. శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు రాగిని భాస్కర్‌ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కోరుట్ల ప్రాంతానికి చెందిన రాగిని భాస్కర్ ఉన్నత పదవికి పదోన్నతి పొందడం అభినందనీయమని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.


రాగిని భాస్కర్‌కు పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.





Post a Comment

0 Comments