కరీంనగర్‌లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశం

 


కరీంనగర్‌లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశం

ప్రజా దండోర న్యూస్ / కరీంనగర్, సెప్టెంబర్ 14: 

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం (సెప్టెంబర్ 15) కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌లోని ఆర్‌ & బి గెస్ట్ హౌస్‌లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొని సామాజిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ కోరారు.

Post a Comment

0 Comments