ఎంబీబీఎస్‌ సీటు సాధించిన రేగుంట కు చెందిన మోతే హన్సిక

 


ఎంబీబీఎస్‌ సీటు సాధించిన రేగుంట కు చెందిన మోతే హన్సిక 


ప్రజా దండోర న్యూస్ / మల్లాపూర్ ప్రతినిధి, సెప్టెంబర్ 4:


 మల్లాపూర్ మండలంలోని రేగుంట విద్యార్థిని ఎంబీబీఎస్‌ మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాల్లో రేగుంట గ్రామానికి చెందిన మోతే శ్రీనివాస్‌, సంజన దంపతుల కుమార్తె మోతే హన్సిక ప్రతిభ చాటింది.

హన్సిక 6547 స్టేట్‌ మెరిట్‌ ర్యాంక్‌ సాధించి, ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసిఫాబాద్‌లో ఎంబీబీఎస్‌ సీటు పొందింది. చిన్ననాటి నుంచి వైద్య విద్యపై ఆసక్తితో కష్టపడి చదివిన హన్సిక తన ప్రతిభతో మెడికల్‌ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మోతే హన్సికను పలువురు అభినందిస్తూ, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి వైద్యురాలిగా సేవలందించాలని ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments