రాహుల్ గాంధీ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని - కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో



రాహుల్ గాంధీ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని - కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో 

 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే పాల్గొన్న సభాప్రాంగణాన్ని బిజేపి నాయకులు ఎస్సీ అనే అక్కసుతో గంగాజలంతో శుద్ధి చేయడమేంటి..? 

- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య , రాష్ట్ర నేత జువ్వాడి కృష్ణారావు 

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 3:

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ  కేసును వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా, రాస్తారోకో చేపట్టారు.



 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాస్తారోకో చేపట్టారు. 





అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వా జిల్లాలో ఎస్ఐఆర్ పై నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించి వెళ్లిన తర్వాత ఆ సభా ప్రాంగణాన్ని అక్కడి బిజెపి నేతలు గంగాజలంతో శుద్ధి చేయడం మూర్ఖత్వపు చర్యగా ఖండించారు. దళితనేత వచ్చి సమావేశం ఏర్పాటు చేసి వెళ్తే ఆ సభా ప్రాంగణాన్ని గంగా జలంతో శుద్ధి చేయడం ఎంతవరకు సమంజసమని బిజేపి కి దళితులంటే లెక్క లేదని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని  మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేస్తుందని యావత్ భారత దేశ ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు. అలాగే ఇట్టి విషయంపై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని ప్రజలకు సేవ చేయాలని అలాగే రాహుల్ గాంధీ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దళితులపై ఎంత అక్కసితో ఉందో ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments