మెట్‌పల్లిలో బొల్లారం రాజ గంగారాంకు ఘన నివాళులు - పెద్దకర్మకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, కుల సంఘం నాయకులు
ప్రజా దండోర న్యూస్ / మెట్‌పల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 2:
మెట్‌పల్లి పట్టణానికి చెందిన బొల్లారం రాజ గంగారాం పెద్దకర్మ కార్యక్రమం బుధవారం ఆయన స్వగృహంలో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై రాజ గంగారాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజ గంగారాం మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రాజు గంగారాం కుమారులు బొల్లారం అనీల్ కుమార్, అరుణ్ కుమార్, బామ్మర్ది గడచంద వెంకటేష్, ఇయ్యపుడు డా. పేట భాస్కర్, బంధువులు చౌలమద్ది శంకర్, బి. సంజీవ్, చిట్యాల రాజేష్, పేట అశోక్, శనిగారపు రాజేశ్వర్, చిట్యాల లచ్చయ్య, బొప్పారపు భూమయ్య, పేట ప్రభాస్, అనుదీప్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
అదేవిధంగా కుల సంఘం నాయకులు బర్ల అంజయ్య, లక్ష్మణ్, లంక శ్రీకాంత్, సంజీవ్, బర్ల సంతోష్, రవికుమార్ తదితరులు హాజరై రాజ గంగారాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
రాజ గంగారాం మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


0 Comments