హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్, కోర్టుకు రిమాండ్ - కోరుట్ల సి ఐ వెల్లడి



హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్ – కోర్టుకు రిమాండ్

ఎంతకాలం పరారీలో ఉన్నా చివరకు చట్టం ముందు నిలబడాల్సిందే - సి ఐ లక్ష్మీ నారాయణ 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల, అక్టోబర్ 6 : 

2024 సంవత్సరంలో కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో జరిగిన హత్యాయత్నం మరియు నేరపూరిత కుట్ర కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఠాకూర్ వినయ్ సింగ్ (31)**ను కోరుట్ల పోలీసులు 06-10-2026 తెల్లవారుజామున అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల అనంతరం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసు Cr.No.341/2024గా నమోదు చేయబడింది. 24-06-2024 రాత్రి గాంధీ రోడ్‌లో ఫిర్యాదుదారు పొగుల రాజేష్‌పై పాత కక్షల నేపథ్యంలో నిందితులు కలిసి పథకం ప్రకారం దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో ఇప్పటికే A-2 నుండి A-6 వరకు నిందితులను అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, మరికొందరు నిందితులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడైన A-1 ఠాకూర్ వినయ్ సింగ్ అప్పటి నుండి పరారీలో ఉంటూ పోలీసుల అరెస్టును తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

కోరుట్ల CI K. లక్ష్మీ నారాయణ గారి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  కోరుట్ల SI G. శ్యామ్ రాజ్ గారు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరిస్తూ  ఈ రోజు అనగా తేదీ: 06-10-2026 కోరుట్ల బస్‌స్టాండ్ వద్ద పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఠాకూర్ వినయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా కేసులో తన పాత్రకు సంబంధించి వివరాలు వెల్లడించాడు. పంచుల సమక్షంలో చట్టప్రకారం కాన్ఫెషన్ పంచనామా నిర్వహించారు.

అనంతరం నిందితుడి అరెస్ట్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

పోలీసుల హెచ్చరిక

నేరాలకు పాల్పడి చట్టం నుండి తప్పించుకోవడానికి ఎంతకాలం పరారీలో ఉన్నా, చివరకు చట్టం ముందు నిలబడాల్సిందే. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. నేరస్తులు ఎక్కడ దాక్కున్నా, వారిని చట్టపరమైన ఆధారాలతో గుర్తించి న్యాయస్థానం ముందు హాజరుపరచడం పోలీసుల బాధ్యత.

ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఏదైనా నేర సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.

చాలా రోజులుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేసిన కోరుట్ల CI K. లక్ష్మీ నారాయణ, SI G. శ్యామ్ రాజ్ మరియు కోరుట్ల పోలీస్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0 Comments