కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్‌ను ఘనంగా సన్మానించిన డా. పేట భాస్కర్


 కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్‌ను ఘనంగా సన్మానించిన డా. పేట భాస్కర్


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 13 : 


కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఈ మధ్యనే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్యామ్ రాజ్ ను తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక, ఎడిటర్ డా. పేట భాస్కర్ గురువారం ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఎస్సై శ్యామ్ రాజ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని డా. పేట భాస్కర్ పేర్కొన్నారు. ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రజాసంఘాల ప్రతినిధులు, మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారి శంకర్, వెంకటపూర్ సర్పంచ్ ద్యాగ గంగాధర్, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మారంపల్లి భూమయ్య, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు శనిగారపు రాజేష్, నాయకులు వన్నెల శంకర్, అన్నరపు రాజేందర్ తదితరులు పాల్గొని ఎస్సై శ్యామ్ రాజ్‌కు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments