అధికారుల అత్యుత్సాహము.. కోరుట్ల గడి మైసమ్మ గుడి షెడ్డు కూల్చడంతో భగ్గుమన్న బిజెపి శ్రేణులు


అధికారుల అత్యుత్సాహము.. కోరుట్ల గడి మైసమ్మ గుడి షెడ్డు కూల్చడంతో భగ్గుమన్న బిజెపి శ్రేణులు 


చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణపై పట్టింపులేని అధికారులు కూల్చడానికి మాత్రం ముందున్నారని బిజేపి నాయకుల ఆరోపణలు..!


అనంతరం కోరుట్ల పోలీసు స్టేషన్ లో సిఐ లక్ష్మీనారాయణ కు పిర్యాదు 


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఆగస్టు 14:


కోరుట్ల పట్టణంలోని గడి మైసమ్మ ఆలయ పరిసరాల్లో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈమధ్యనే ఏర్పాటు చేసిన నీడ గుడి షెడ్డు ను అధికారులు 24 గంటలు తిరగకముందే కూల్చివేయడం దుర్మార్గపు చర్య అని బిజేపి పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, ధార్మిక విభాగం సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్ లు తీవ్రంగా ఆరోపించారు.


శుక్రవారం గడి మైసమ్మ నీడ గుడిని కూల్చిన ప్రాంతాన్ని గడి బురుజులలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన బిజెపి నాయకులు మాట్లాడుతూ చారిత్రక, ఆధ్యాత్మిక గడి స్థలాల పరిరక్షణపై పట్టింపులేని మున్సిపల్, రెవెన్యూ అధికారులు రియాల్టర్లతో కుమ్మక్కై పోలీసుల రక్షణలో  కూల్చడానికి మాత్రం ముందున్నారని దుయ్యబట్టారు.  





గడి ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో పాటు, గడి మైసమ్మను స్థానిక ప్రజలు ఎంతోకాలంగా భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను పరిరక్షించాల్సిన అధికారులు, వాటిని కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని గడి స్థలాలలో అక్రమంగా వి ఎల్ టి లు వేసిన అధికారులు గడి చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలపై నోరు మెదపడం లేదని అన్నారు.



ఇకనైనా గడి బురుజుల స్థలాలను పరిరక్షించాలని గతంలో నుండి కూడా అనేక ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ బిజేపి మరింత బలమైన పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. గడిబురుజుల ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను పరిశీలించిన నాయకులు అనంతరం కోరుట్ల పోలీస్ స్టేషన్లో హిందూ దేవుళ్ళపై జరుగుతున్న కవ్వింపు చర్యలపై సిఐ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు.



అధికారులు వెంటనే స్పందించి నీడ గుడి కూల్చివేతకు గల కారణాలను ప్రజలకు వెల్లడించాలని, అక్రమ వి ఎల్ టి లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గడి మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ప్రజల మనోభావాలను ధ్వంసం చేయవద్దని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.



ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాడవే నరేష్ బిజెపి జిల్లా కార్యదర్శి సుధావేని మహేష్, కౌన్సిలర్లు తిరుమల వాసు కళాల సాయి చంద్, నాయకులు సడిగే మహేష్, పోతుగంటి రవి, సంకు నరేందర్, ఎర్ర రాజేందర్, బెక్కెం అశోక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments